Castor Oil Hair Growth: జుట్టు పెరుగుదలకు ఆముదంను ఎలా ఉపయోగించాలి?

Castor Oil Hair Growth: జుట్టు పెరుగుదలకు, జుట్టు కి సంబంధించిన ఎన్నో విషయాల్లో ఆముదానికి చాలా ప్రాముఖ్యం ఉంది. అయితే ఈ ఆముదంను ఎలా ఉపయోగించాలి. పెద్దలు, ఆయుర్వేద శాస్త్రజ్ఞులు ఎలాంటి చిట్కాలు చెప్పారో తెలుసుకుందాం.

castor-oil-hair-growth-tips-telugu
Source: media.istockphoto.com

పూర్వం రోజుల్లో దాదాపు అందరూ జుట్టుకు ఆముదాన్నే వాడేవారు. వాళ్ల జుట్టు కూడా అంత తొందరగా తెల్లబడేది కాదు. అందుకే మన తాత ముత్తాతల జుట్టు ఒత్తుగా గట్టిగా ఉండేది. అయితే క్రమంగా ఈ ఆముదం వాడకం తగ్గిపోయింది. దాని స్థానంలో కొబ్బరి నూనె వచ్చింది. ఆముదం చేసినంత మేలును, జుట్టుకు బలాన్ని ఈ కొబ్బరి నూనె అందించడం లేదు.

ఆముదం నూనె ప్రయోజనాలు

  • జుట్టు పెరగడానికి సహాయ పడుతుంది
  • జుట్టు చివర్లో చిట్లకుండా కాపాడుతుంది
  • జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది
  • చుండ్రుని శాశ్వతంగా తొలగిస్తుంది

ఆముదం నూనెను ఎలా తయారు చేసుకోవాలి

  • 1 చెంచా ఆముదం నూనె
  • 2 రోజ్మెరీ చుక్కలు
  • 1 చెంచా కొబ్బరి నూనె

పైనున్న అన్నింటినీ ఒక గిన్నెలో కలుపుకోవాలి. ఆ తరువాత వాటిని తల వెంట్రుకలకు రాసుకోవాలి. రాత్రంతా వాటిని అలాగే ఉంచుకుని తెల్లవారుజామున షాంపూతో శుబ్రం చేసుకోవాలి. వారానికి 2, 3 సార్లు ఇలా చేస్తే మీ జుల్లు చూడ్డానికి అందంగా, బలంగా తయారవుతుంది.

చుండ్రు సమస్యను ఇలా తొలగించండి

  • 1 చెంచా ఆముదం నూనె
  • సోల్ ఫ్లవర్ టీ ట్రీ ఎసెన్సియల్ ఆయిల్ 2 చుక్కలు
  • 1 చెంచా కలబంద గుజ్జు

ఒక గిన్నెలో 1 చెంచా కలబంద గుజ్జు తీసుకొని అందులో 2 చుక్కలు సోల్ ఫవర్ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ మరియు 1 చెంచా ఆముదం నూనె వేసి బాగా చిన్న మిశ్రమాన్ని మీ తల వెంట్రుకల కుదుళ్లకు రాసుకుని రాత్రంతా ఉంచుకోవాలి. 1 గంట తర్వాత తేలికపాటి ఫ్యాంపుతో శుభ్రం చేసుకోవాలి. మంచి ఫలితాన్ని పొందడానికి వారానికి 2, 3 సార్లు ఇలా చేస్తే చాలా మంచిది.

జుట్టు విరిగిపోకుండా ఉండటానికి చిట్కా

  • 1 చెంచా ఆముదం నూనె
  • 1 గుడ్డు
  • 2 చెంచా కొబ్బరి నూనె

గుడ్డు పగలకొట్టిన తర్వాత అందులో ఒక చెంచా కొబ్బరి నూనె, ఒక చెంచా ఆముదం నూనె వేసి బాగా కలపాలి. తరువాత ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టాలి. చిన్నగా తలకి మసాజ్ చేయాలి. ఓ గంట తర్వాత ష్యాంపూతో స్నానం చేస్తే జుట్టు మెరిసిపోతూ బలంగా ఉంటుంది.

జుట్టు రాలకుండా ఉండడానికి చిట్కా

  • 1 చెంచా ఆలివ్ ఆయిల్
  • 1 చెంచా బాదం ఆయిల్
  • 1 చెంచా కొబ్బరి నూనె
  • 2 విటమిన్ ఈ టాబ్లెట్లు

ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్, కొబ్బరి నూనె ను ఓ గిన్నెలో బాగా కలుపుకోవాలి. వాటిలో 2 విటమిన్ ఈ టాబ్లెట్లను కూడా వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని రాత్రి తలకు పట్టించి ఉదయం ష్యాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే మీ జుట్టు చాలా బలంగా ఉంటుంది.

ఆముదంతో ఎన్నో ప్రయోజనాలు, కొన్ని చిట్కాలు

  • 4 టీస్పూన్ల కొబ్బరి నూనెలో 2 టీ స్పూన్ల ఆముదం కలిపి పొట్ట మీద పట్టు వేసి రాత్రంగా ఉంచితే ఉదయాన్నే కడుపులో ఉన్న నులిపురుగులు చనిపోతాయి.
  • ఎండవల్ల చర్మం కమిలిపోతే, అక్కడ ఆముదం వేసి పూసి, గంట తర్వాత కడిగివేస్తే చాలా మంచిది
  • ఆముదాన్ని చర్మం మీద ముడతలను కూడా తగ్గిస్తుంది
  • ఆముదంలో ఒమేగా 2 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చర్మంపై అప్లై చేస్తే మచ్చలు కూడా మాయం అవుతాయి
  • ఆముదంలో ముంచిన క్లాత్ ను కీళ్ల నొప్పుల ఉన్న దానిపై ఉంచి, ప్లాస్టిక్ పేపర్ తో కట్టేయాటి. దానిపై వేడి నీళ్ల బాటిల్ ఉంచితే కీళ్ల నొప్పులు కూడా వెంటనే మాయం అవుతాయి.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు