Om Bheem Bush Movie Review: ఓం భీమ్ బుష్ మూవీ రివ్యూ

Om Bheem Bush Movie Review: శ్రీ విష్ణు అంటేనే, కామెడీకి పెట్టింది పేరు, అయితే మధ్యలో కొన్ని కమర్షియల్ చిత్రాలు చేయడంతో పరాజయాలు చూసాడు. ఇక మల్లి తన కామెడీనే నమ్ముకుని, సామజవరగమన చిత్రంతో మంచి విజయం సాధించాడు. ఇక మల్లి ఓం భీం బుష్ అనే కామెడి చిత్రంతో మన ముందుకొచ్చాడు.ట్రైలర్ చూసాక, జాతిరత్నాలు చిత్రంలో ఉన్నట్టు సెన్స్ లెస్ కామెడీ తో వస్తున్నారని అర్థమైంది. పైగా చిత్ర దర్శక నిర్మాతలు కూడా అదే చెప్పారు, ఇక నవ్వించడమే ద్యేయంగా పెట్టుకుని ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూలో చూద్దాం.

Om Bheem Bush Movie Review

కథ

ముగ్గురు స్నేహితులు, క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మరియు మాధవ్ (రాహుల్ రామకృష్ణ) జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఒకరోకు తొందరగా డబ్బు సంపాదించడానికి ‘బ్యాంగ్ బ్రోస్’ ఆలోచన వస్తుంది. ఈ ప్రక్రియలో, వారు భైరవపురం అనే ఊరిలో సంపంగి మహల్‌లో అనే బంగ్లాలో నిధి ఉంది, దాన్ని తీసుకురావాలి అని కారు చెప్తారు. ఇక ఒక్క నిమిషంకూడా ఆలోచించకుండా, భైరవపురం వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఎం జరిగింది, సంపంగి మహల్ లో ఈ ముగ్గురు ఎదుర్కున్న సమస్యలేంటి అనేది మిగతా కథ.

ఓం భీమ్ బుష్ మూవీ నటీనటులు

శ్రీ విష్ణు, ప్రీతి ముఖుందన్, యేషా ఖాన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి శ్రీ హర్ష కొనుగంటి రచన మరియు దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్‌కు చెందిన వీ సెల్యూలాయిడ్స్‌తో కలిసి సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సన్నీ ఎంఆర్, ఛాయాగ్రహణం రాజ్ తోట.

సినిమా పేరుఓం భీమ్ బుష్
దర్శకుడుశ్రీ హర్ష కొనుగంటి
నటీనటులుశ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, తదితరులు
నిర్మాతలుసునీల్ బలుసు
సంగీతంసన్నీ ఎంఆర్
సినిమాటోగ్రఫీరాజ్ తోట
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

ఓం భీమ్ బుష్ సినిమా ఎలా ఉందంటే?

కొన్ని కామెడీ చిత్రాలు చాల లాజికల్ గా ఉంటాయి, కానీ కొన్ని చిత్రాలు లాజిక్స్ ఎం లేకుండా ఉంటాయి. అయితే జాతిరత్నాలు సినిమా తరువాత, ఓన్లీ కామెడీ పండితే చాలు కథ, లాజిక్స్ ఎం అవసరంలేదు అనే లాగా చాల సినిమాలే ఒచ్చాయి. ఇక ప్రేక్షకులు కూడా అవేం పట్టించుకోకుండా, ప్రేక్షకులని నవ్విస్తే చాలు సినిమాలు హిట్ అయిపోతున్నాయి. అలా వచ్చిందే ఈ ఓం భీం బుష్.

పాత్రల పరిచయంతో అసలు కథలోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకున్నప్పటికీ. ఒక్కసారి ముగ్గురు భైరవపురం వెళ్ళాక, ఇక కథ ఏంటి అనేది మర్చిపోయి ప్రతి సన్నివేశం నవ్విస్తూనే ఉంటుంది. మొదటి భాగంలో ఏక్కువగా శ్రీ విష్ణు తన కామెడీ తో నవ్విస్తే, ఇక రెండవ భాగంలో ప్రియదర్శి, రాహువులు రామకృష్ణ నవ్విస్తారు. ఇక సినిమాలో చాల నెగిటివ్స్ కూడా చాలానే ఉన్నాయ్. కథ లేకుండా ఓకే కానీ, తెర పై చెప్పే కథకైన చాల ప్రశ్నలకి సమాదానాలు ఇవ్వకుండా ముగించడం కొంచెం నిరాశపరిచినట్టే.

ఇక నటన విషయానికి వస్తే, ఎప్పటిలాగే శ్రీ విష్ణు తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో సినిమా మొత్తం నవ్విస్తూనే ఉంటాడు. ఇక ప్రియదర్శి కూడా తన కామెడీ తో నవ్వించాడు, రెండవ భాగంలో కొన్ని సన్నివేశాల్లో అద్భుతమైన కామెడీ ని పండించాడు. ఇక రాహుల్ రామకృష్ణ కామెడీ పర్వాలేదు. ఆయేషా ఖాన్ ఉన్నది కాసేపే అయిన తన అందంతో ఆకట్టు కుంది. ఇక మిగిలిన నటి నటులు వారి పాత్రల మేరకు బాగేనే చేసారు.

శ్రీ హర్ష కొనుగంటి, హారర్ ని మరియు కామెడీ బ్లెండ్ చేసిన విధానం చాల బాగుంది. కానీ కొంచెం కథ కూడా ఉండేలా చూస్కుంటే బాగుండేది. చాల చోట్ల చూసే ప్రేక్షకుడికి ప్రశ్నలు మైండ్ లో తిరుగుతుంటాయి కానీ వాటికి ఎక్కడ సమాధానం దొరకదు. ఏది ఏమైనా కామెడీ ఒక్కటి చూసుకుంటే, శ్రీ హర్ష కొనుగంటి కి నూటికి నూరు శాతం మార్కులు పడతాయి.

సాంకేతికంగా ఓం భీం బుష్ పర్వాలేదు, లిమిటెడ్ బడ్జెట్ లో తీసినప్పటికి, రాజ్ తోట ఛాయాగ్రహణం రిచ్ గా కనిపిస్తుంది. సన్నీ ఎం ఆర్ పాటలు అంతగా ఆకట్టుకోవు కానీ, నేపధ్య సంగీతం బాగుంది.

చివరికి, ఓం భీమ్ బుష్ నో లాజిక్ ఓన్లీ కామెడీ.

ప్లస్ పాయింట్లు:

  • కామెడీ

మైనస్ పాయింట్లు:

  • కథ
  • క్లైమాక్స్

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు