
జగపతి బాబు, లయ జంటగా నటించిన ‘వదల’ చిత్రం థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.
‘వదల’ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో జగపతి బాబు, లయ, హృతిక శ్రీనివాస్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి అక్కెల్ల వి. కృష్ణ దర్శకత్వం వహించగా, కార్తీక్ బి. కొడకండ్ల సంగీతం అందించారు. చరిత చిత్ర బ్యానర్‌పై కిశోర్ నాయుడు చిరుమామిళ్ల మరియు తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రాన్ని నిర్మించారు.
