
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
‘చెన్నై లవ్ స్టోరీ’ ఆగస్టు 21, 2026 నుంచి SonyLIVలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
కిరణ్ అబ్బవరంతో పాటు ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియా, త్రిగుణ్, దేవి ప్రసాద్, దీపా శంకర్, నవీన్ నేని, పి. వాసు తదితరులు నటించారు.
ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించగా, విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రాన్ని SKN, సాయి రాజేష్ నిర్మించారు.
