
RX 100’, ‘మంగళవారం’ చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి, మహేష్ బాబు కుటుంబానికి చెందిన జై కృష్ణ ఘట్టమనేనిని హీరోగా పరిచయం చేశారు.
ఈ చిత్రం థియేటర్లలో మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, ఆ అంచనాలను అందుకోలేకపోయింది.
శ్రీనివాస మంగాపురం చిత్రం ఆగస్టు 20, 2026 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో జై కృష్ణ ఘట్టమనేని, రాశా థడాని, మోహన్ బాబు, బ్రహ్మాజీ, అజయ్, నరేష్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
