
నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో నటించిన బెత్లహెమ్ కుటుంబ యూనిట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
బెత్లహెమ్ కుటుంబ యూనిట్ చిత్రం అక్టోబర్ 02, 2026 నుంచి జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఈ చిత్రంలో నివిన్ పౌలీ, మమితా బైజు, సంగీత్ ప్రతాప్, రోషన్ షనవాస్, శ్యామ్ మోహన్, స్రిందా, పార్వతి అయ్యప్పదాస్, సురేష్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, షమీర్ ఖాన్ తదితరులు నటించారు.
గిరీష్ ఏడీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విష్ణు విజయ్ సంగీతం అందించగా, అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ నిర్వహించారు. దిలీష్ పోతన్, ఫహద్ ఫాజిల్, శ్యామ్ పుష్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
