
విజయవంతమైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రంతో నిర్మాతగా మారారు. రొమాంచకం సినిమాను సందీప్ రెడ్డి వంగా, ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా కలిసి భారీగా ప్రమోట్ చేశారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. రొమాంచకం చిత్రం అక్టోబర్ 01, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్, వెంకటేష్ కాకుమాను, మణి ఏగుర్ల, ఉపేంద్ర లిమాయే, సాయి సోహన్, నరేంద్ర రవి తదితరులు నటించారు.
వేణు గోపాల్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, వాసుకి వైభవ్ సంగీతం అందించారు. పవన్ పప్పుల సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
