
భువన్ బామ్ నటించిన ‘తాజా ఖబర్’కు అధికారిక రీమేక్‌గా ‘వరమ్’ తెరకెక్కింది. ఈ సిరీస్ OTT విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
‘వరమ్’ అక్టోబర్ 22, 2026 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ కేవలం తెలుగులోనే విడుదల కానుంది. ఇందులో విశ్వదేవ్ రాచకొండ, శివాత్మిక రాజశేఖర్, శ్రీనివాస్ అవసరాల, శివాజీ రాజా, రమేష్ కొణంబొట్ల, శుర్థి జయన్, సురభి ప్రభావతి తదితరులు నటించారు.
ఈ సిరీస్‌కు ఆదిత్య మండల దర్శకత్వం వహించారు. సిద్ధార్థ్ సదాశివుని సంగీతం అందించగా, ఫహద్ అబ్దుల్ మజీబ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. సుస్మిత కొణిదెల ఈ సిరీస్‌ను నిర్మించారు.
