
ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్’ అనేది సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం. ప్రేమలు, బెత్లహేమ్ కుటుంబ యూనిట్ వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలతో ఆకట్టుకున్న సంగీత్ ప్రతాప్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ‘ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్’ అక్టోబర్ 15, 2026 నుంచి మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమా మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఇందులో సంగీత్ ప్రతాప్, షరాఫ్ యు ధీన్, అఖిల భార్గవన్, నీతు చంద్రన్, కొట్టాయం నజీర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
శ్యామిన్ గిరీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ముజీబ్ మజీద్ సంగీతాన్ని అందించారు. అఖిల్ జేవియర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. డాక్టర్ పాల్ వర్గీస్, సుజిత్ జె. నాయర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
