జోజు జార్జ్ ‘ఆశా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

జోజు జార్జ్ ‘ఆశా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆశా’ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద సగటు విజయంతో సరిపెట్టుకుంది.

ఇప్పుడు ఈ థ్రిల్లర్ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘ఆశా’ సినిమా అక్టోబర్ 16, 2026 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ సినిమాలో జోజు జార్జ్, ఊర్వశి, ఐశ్వర్య లక్ష్మి, జాయ్ మాథ్యూ, షరీ, అమృత కృష్ణకుమార్, విజయరాఘవన్, ప్రశాంత్ అలెగ్జాండర్, ఫెహ్మిన్, భాగ్యలక్ష్మి, రమేష్ గిరిజ, అజయన్ ఆదత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి సఫర్ సనల్ దర్శకత్వం వహించగా, నీలకంఠన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. అజయన్ ఆదత్ సంగీతం అందించగా, వినాయక అజిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు