మధువిధు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగు సహా 5 భాషల్లో స్ట్రీమింగ్

మధువిధు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగు సహా 5 భాషల్లో స్ట్రీమింగ్

ఈ మలయాళ రొమాంటిక్ కామెడీ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీ అరంగేట్రానికి సిద్ధమైంది. ఈ సినిమాను మే 22, 2026 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

‘మధువిధు’ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో షరఫ్ ఉద్ ధీన్, కళ్యాణి పనిక్కర్, జగదీష్, అజీజ్ నెడుమంగాడు, సాయికుమార్, శ్రీజయ, అమల్ జోస్, సంజు, మధు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి విష్ణు అరవింద్ దర్శకత్వం వహించగా, హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని సమకూర్చారు. విశ్వజిత్ ఒదుక్కటిల్ సినిమాటోగ్రఫీ అందించగా, వినాయక అజిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు