రమణి కళ్యాణం OTT రిలీజ్ డేట్ ఫిక్స్

రమణి కళ్యాణం OTT రిలీజ్ డేట్ ఫిక్స్

పెద్ద సినిమాలకే ఇప్పుడు థియేటర్లలో ఎక్కువ రోజులు నిలబడటం కష్టంగా మారింది. ఇక చిన్న సినిమాల పరిస్థితి మరింత కఠినంగా ఉంది. అలానే చిన్న సినిమాగా విడుదలైన రమణి కళ్యాణం కూడా థియేటర్లలో ప్రేక్షకుల స్పందన లేక వాష్‌అవుట్ అయింది.

ఇప్పుడు ఈ సినిమా OTTలోకి రాబోతోంది. రమణి కళ్యాణం జూన్ 12, 2026 నుంచి సన్ నెక్స్ట్ మరియు ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమాలో సూర్య వశిష్ట, దీప్షిఖా చంద్రన్, చైతు జొన్నలగడ్డ, శ్రీనివాస రెడ్డి, ప్రభావతి, శ్యామల తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించగా, అరవింద్ తిరుకోవెల సినిమాటోగ్రఫీ నిర్వహించారు. సూరజ్ ఎస్. కురుప్ సంగీతం అందించగా, కైట్స్ క్రియేటివ్స్ ఈ సినిమాను నిర్మించింది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు