
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీగా ప్రమోట్ చేసిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ స్పోర్ట్స్ డ్రామా చివరికి సగటు వసూళ్లతో తన థియేట్రికల్ రన్‌ను ముగించింది.
ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘పెద్ది’ జూలై 9, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు జాన్వీ కపూర్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివ రాజ్‌కుమార్, బోమన్ ఇరానీ, చమ్మక్ చంద్ర, సత్య, ఉపేంద్ర లిమాయే తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి బుచ్చి బాబు సానా కథ, దర్శకత్వం వహించగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రఫీని రత్నవేలు నిర్వహించారు. వృద్ధి సినిమా బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించారు.
