ఆహాలోకి వస్తున్న ‘దీవానా’.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆహాలోకి వస్తున్న ‘దీవానా’.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ప్రేమకథలను చూపించే తీరు పూర్తిగా మారిపోయింది. అదే తరహా కథాంశంతో తెరకెక్కిన చిత్రమే దీవానా.

ఈ రొమాంటిక్ డ్రామా థియేటర్లలో మంచి స్పందనను అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దీవానా జూలై 31, 2026 నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేగలై ప్రధాన పాత్రల్లో నటించగా, నరేష్, ఝాన్సీ, జీవన్ కుమార్, రఘు కుమార్ కరుమంచి, నల్ల శ్రీధర్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించగా, ఈశ్వర్ చంద్ సంగీతం అందించారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ నిర్వహించగా, అర్హా మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యకంపూడి సంయుక్తంగా నిర్మించారు

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు