జగపతి బాబు ‘వదల’ ఓటీటీ రిలీజ్.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

జగపతి బాబు ‘వదల’ ఓటీటీ రిలీజ్.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే

జగపతి బాబు, లయ జంటగా నటించిన ‘వదల’ చిత్రం థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.

‘వదల’ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో జగపతి బాబు, లయ, హృతిక శ్రీనివాస్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి అక్కెల్ల వి. కృష్ణ దర్శకత్వం వహించగా, కార్తీక్ బి. కొడకండ్ల సంగీతం అందించారు. చరిత చిత్ర బ్యానర్‌పై కిశోర్ నాయుడు చిరుమామిళ్ల మరియు తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు