Yagnopaveetham Rules In Telugu: యజ్ఞోపవీతాన్ని ఎలా ధరించాలి, రూల్స్ ఏమిటి?

Yagnopaveetham Rules In Telugu: యజ్ఞోపవీతాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. అనేక మంది వీటిని ధరించడం మనం చూసి ఉంటాం. ఎంతో మంది శరీరాలపై ఇది వేళాడుతూ ఉంటుంది. గుళ్లో పంతుళ్లకి సాధారణంగా ఉంటుంది. అయితే సామాన్యుల్లో కూడా చాలా మంది ఈ యజ్ఞోపవీతాన్ని వేసుకుంటారు కానీ పైనుండి షర్ట్ వేసుకోవడం వల్ల అది కనపడదు.

Yagnopaveetham Rules In Telugu

పురుషులు యవ్వనంలో అడుగుపెడుతున్నప్పుడు పెద్దలు ఈ యజ్ఞోపవీతాన్ని పురుషులకు పండితులచేత వేయిస్తారు. అయితే ఇదంతా చాలా పధ్దతిగా జరుగుతుంది. వాటి రూల్స్, నియమాలు గురించి ఇక్కడ మీకు కింద వివరించాము.

“ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః”

పైమంత్రం తంతువులకు సంబంధించినది. యజ్ఞోపవీతాన్ని తొమ్మిది తంతువులతో అంటే తొమ్మిది దారపు పోగులతో నిర్మించాలి. ఒక్కో తంతువుకు ఒక్కో దేవత ఉంటాడని శాస్త్రం చెబుతుంది. మొదటి తంతువులో ఓంకారం, 2వ తంతులో అగ్నిదేవుడు, 3వ తంతులో నాగదేవత, 4వ తంతులో సోమదేవుడు, నాలుగవ తంతువులో సోమదేవుత, ఐదవ తంతువులో పితృదేవతలు, ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, ఏడవ తంతువులో వాయుదేవుడు, ఎనిమిదవ తంతువులో సూర్యుడు, తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం

సరైన తిథి, వారం, నక్షత్రం చూసి యజ్ఞోపవీత కార్యాన్ని మొదలు పెట్టాలి. నడుము వరకు మాత్రమే యజ్ఞోపవీతం వేలాడుతూ ఉండాలి. నడుముకంటే పైనా కిందా ఉండడం మంచిది కాదు. చిన్నగా ఉంటే ఆయుశ్శు తగ్గుతుంది, పెద్దగా ఉంటే తపన నశిస్తుంది. సన్నగా ఉంటే ధన నష్టం జరుగుతుంది.

బ్రహ్మచారి ఒకటి, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలు ధరించాలి. ఆరునెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కాబట్టి ఆరునెల్లకోసారి మారుస్తూ ఉండాలి. మంత్రపఠన చేస్తే యజ్ఞోపవీతాన్ని ధరించాలి అలాగే తీసివేస్తున్న సమయంలో కూడా మంత్ర పఠన చేయాలి.

యజ్ఞోపవీతాన్ని ఇతర వస్తువులకు కట్టి అవవిత్రం చేయవద్దు. లేదంటే పాపాలు చుట్టుకుటాయి. వాటిని జాగ్రత్తా కాపాడుకుంటూ ఉపయోగించాలి. ప్రతీ రోజు గాయత్రీ అనుష్టానం చేస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ దైవానికి దగ్గరగా ఉండాలి.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు