Manu Dharma Sastram: మనుధర్మ శాస్త్రం, మనుమహర్శి

Manudharma Sastram: మనుధర్మ శాస్త్రం హిందూ సంస్కృతిలో భాగంగా వస్తూ ఉంది. దీనికి మనువు అనే మహర్శి క్రీపూ. 200 – క్రిపూ 200 మధ్య రచించారు. ఈ మనుధర్మ శాస్త్రంలో గృహ, సామాజిక, మతపరమైన నియమాలను చర్చించారు. ఈ గ్రంధంలో మొత్తం 2684 వాక్యాలు ఉంటాయి. దీనికి 12 అధ్యాయాలుగా విభజించారు.

మనుధర్మ-శాస్త్రం

మనుధర్మ శాస్త్రంలో అనేక విషయాలను చర్చించినా అందులో ముఖ్యమైన వాటిగురంచి కింద కింద అందించాము.

బ్రాహ్మణులు పండితులను, క్షత్రీయులు పాలకులని, వైశ్యులు వ్యాపారవేత్తలని ఇక శూద్రలు పనిచేసేవారని మనువు నిర్ధరించాడు.

ఉపనయనం జరిపించే సరైన వయసుని వివిధ వర్గం వారికి వేరు వేరుగా చెప్పాుడ. బ్రాహ్మణుడు 8 సంవత్సరాలకు, క్షత్రియుడు 11 ఏళ్లకు, వైశ్యుడు 12 ఏళ్లకు ఉపనయనం జరిపించాలని మనువు వివరించాడు.

గురువు బ్రాహ్మణుడితో సమానమని, తండ్రి రాజులాంటి వాడని, తల్లి భూదేవి లాంటిదని, అన్న తన స్వరూపముగా మనువు రాశాడు.

స్త్రీలు సోదరుల నుంచి, తండ్రి నుంచి, భర్త నుంచి, మరుదల నుంచి గౌరవాన్ని పొందాలని వివరించాడు.

స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని, ఎక్కడైతే గౌరవింపబడరో అక్కడ ఏమి చేసినా ఫలితం ఉండదని మనువు చెప్పాడు.

స్త్రీలు ఏ కుటుంబంలో అయితే బాధపడతారో ఆ కుటుంబం నాశనమవుతుందని, ఏ కుటుంబమైతే సంతోషంగా ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వదింపబడుతుందని అంటాడు మనువు.

పురుషులు స్త్రీలకు వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి గౌరవించాలని చెప్పాడు.

భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య గౌరవం ఉన్న కుటుంబాలు సంతోషంగా ఉంటాయిని మనుధర్మ శాస్త్రంలో ఉంది.

ఇంటిపనుల్లో, గృహోపకరణాలు, శుభ్రం చేసే పనుల్లో, ఆర్ధిక విషయాల్లో స్త్రీ తెలివిగా చురుకుగా ఉండాలి.

అయితే మనుధర్మ శాస్త్రంపై మహిళా సంఘాలు విరుచుకుపడుతున్నాయి. స్త్రీలను తక్కువగా చిన్నగా చేసి అవమానించారని గతంలో ఎన్నో సార్లు ఆందోళన నిర్వహించారు. భారతదేశ ప్రజలందరికీ రాజ్యాంగం సమాన హక్కులిచ్చిందని, మనుధర్మ శాస్త్రం దీనికి విదుర్ధంగా ఉందని చర్చ సాగుతోంది.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు