Environment Essay In Telugu: పర్యావరణం పరిరక్షణ వ్యాసం తెలుగులో..

Environment Essay In Telugu: పర్యావరణం ప్రతీఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైంది. కానీ పర్యావరణం దినోత్సవం రోజు అందరూ పర్యావరణం గొప్పతనం గురించి మెస్సెజిలు షేర్ చేయడం వరకే పరిమితమవుతారు. ప్రతీ రోజు పర్యావరణ పరిరక్షణకై మనవంతు కృషి చేస్తే రాబోయే తరాలకు మంచి పర్యావరణాన్ని, మంచి వాతావరణాన్ని అందించిన వారమౌతాము.

Environment Essay In Telugu
Pic Credit: www.voicesofyouth.org

ప్రతీ ఒక్కరూ తమ పుట్టిన రోజును ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కొందరు వేలు ఖర్చు పెట్టి గిఫ్ట్స్ కొంటారు. ఇంకొందరు లక్షలు ఖర్చు పెడతారు. తమ పుట్టిన రోజున ఒక మొక్కని పరిసరాల్లో నాటితే, ఆ మొక్క మీ వచ్చే పుట్టిన రోజుకి పెద్దదై మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. పరిసరాలు పచ్చగా ఉంటేనే వాతావరణం ఆహ్లాదకరంగా అందంగా ఉంటుంది.

చెట్లు కార్బన్ డైయాక్సైడ్ ను పీల్చుకుని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. నగరంతో పాటు ఊళ్లల్లో కూడా ప్రస్తుతం విషవాయువులు, రేడియేషన్ అధికంగా విడుదలవుతున్నాయి. వీటన్నింటినీ తట్టుకొని ఎదుక్కోవాలంటే పచ్చదనమే పరిష్కారం. చెట్ల వల్ల ఆక్సిజన్ శాతం పెరుగుతుంది, కాలుష్యం తగ్గుతుంది, వర్షాలు పడడానికి కూడా పరోక్షంగా సహాయపడతాయి.

ప్రాచీన కాలంనుంచి చెట్లకు, పచ్చదనానికి మన సంస్కృతి ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. అందుకూ పండగ రాగానే వాకిళ్లు, ఇంటిగుమ్మాలని అరటి కొమ్మలతో, వేప ఆకులతో, మామిడి ఆకులతో అలంకరిస్తారు. గుమ్మానికి అరటిఆకులను కట్టడం ద్వారా కాలుష్యం ఇంటిలోపలికి రాకుండా ఉంటుంది.

వేపచెట్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. వేపచెట్టుని పూజిస్తే మూఢనమ్మకం అంటారు. కానీ అదే వేపచెట్టు అక్కడ ఉన్నంతకాలం ఎంతో మందికి నీడని, ఆయుర్వేద ఔషదాన్ని, స్వచ్ఛని గాలిని, ఆక్సిజన్ ను అందిస్తుంది.

మనిషి దురాశే కాలుష్యం పెరగడానికి మూల కారణం అవుతోంది. లక్జరీ లైఫ్ ఎన్నో చెట్ల నరికివేతకు కారణం అవుతుంది. చెట్లనుంచి ఫర్నీచర్, ఔషదాలు, రబ్బర్ ఇలా ఎన్నింటినో తయారు  చేయవచ్చు. ఒక చెట్టును నరికితే, 5 మొక్కలను నాటాలన్నది పెద్దల మాట. కాని చెట్లను నరుక్కుంటూ వెళ్లిపోతున్నారు గాని మళ్లీ ఒక్క మొక్కను కూడా నాటడం లేదు.

ప్రకృతి మనల్ని రక్షించేది మాత్రమే కాదు, హద్దులు మీరితే శిక్షించేది కూడా. ప్రస్తుతం అక్కడక్కడా అడవులు కాలిపోవడం, అంటార్క్ టికా మంచు కిరిగిపోతుండటం, త్సునామీలు రావడం, భూకంపాలు రావడం, చెరువులు ఎండిపోవడం, వర్షాలు పడకపోవడం ఇవన్నీ పర్యవరణ హెచ్చరిక సంకేతాలు. కాబట్టి పర్యావరణాన్ని మీరు రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు