Plava Nama Samvatsara Panchangam Telugu: న్యూ ఇయర్ మనందరికీ తెలిసిందే, ఏడాది ఎండింగ్ లో డిసెంబర్ 31న రాత్రి ఘనంగా అందరూ న్యూయర్ జరుపుకుంటారు. అయితే పండితులు ఇది ఆంగ్ల కొత్త సంవత్సరం అని, తెలుగు నూతన సంవత్సరం ఉగాదిగి ప్రారంభం అవుతుందని ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. ప్రపంచంలో అనేక సంస్కృతులకు వేరు వేరు క్యాలెండర్లు ఉన్నాయి. అయితే హైందవ సంస్కృతికి తెలుగు పంచాంగమే తెలుగు న్యూ ఇయర్ గా గుర్తింపు వచ్చింది. తెలుగు న్యూ ఇయర్ 2021 ఎప్రిల్ 13వ తేదీ నుంచి ప్రారంభం అయింది, ఎప్రిల్ 1న ఇది ముగుస్తుంది.
“ప్లవ” అంటే తేలియాడేది, బోటు, ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి జంప్ చేసేది. దీనికి బట్టి ఈ ఏడాదిలో నీరు పుష్కలంగా లభిస్తుందని, నీటి సమస్యలు ఏవీ ఉండవని శ్రీ ప్లవ నామ సంవత్సరం చెబుతుంది.
షృష్టి ప్రారంభం అయ్యే సమయంలో బ్రహ్మదేవుడు, బ్రహ్మకల్పం ఆరంభమయ్యే మొదటి సంవత్సరమైన ప్రభవలో, మొదటిమాసమైన చైత్రమాసంలో, రుతువులలో మొదటి బుతువైన వసంత రుతువులో, మొదటి తిథి అయిన పాఢ్యమి రోజు, మొదటి వారం అయిన ఆదివారం, మొదటి నక్షత్రం అయిన అశ్విని నక్షత్రంలో ప్రభావిమ్పజేశాడు. అదే యుగానికి ఆది, దాన్నే ఉగాది అంటారు.
ప్లవనామ సంవత్సరం ప్రత్యేకత
65 తెలుగు కాలమాన సంవత్సారలలో శ్రీ ప్లవ నామ సంవత్సరం 35వ సంవత్సరం. ఈ ప్లవనామ సంవత్సరానికి రాజు కుజుడు, అధిపతి బుధుడు. పంచాంగం, పండితుల ప్రకారం ఈ సంవత్సరం మధ్యలో వర్షాలు కురుస్తాయి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా పెరుగుతుంది.
13 ఏప్రిల్ 2021 – 07 మే 2021 వరకు తిరిగి 02 జనవరి 2022 – 16 జనవరి 2022 వరకు
శ్రీ ప్లవ నామ సంవత్సరంలో గురు మూడమి సమయం: 18 ఫిబ్రవరి 2022 – మార్చ్ 2022 వరకు
ఈ తెలుగు సంవత్సరంలో మకర సంక్రాంతి జనవరి 14, 2022న మధ్యాహ్నం 2:21నిమిశాలకు ప్రారంభం అవుతుంది.
ఈ ప్లవ నామసంవత్సంలో గ్రహణాలు లేవు. మన భారత దేశానికి వరించే గ్రహణాలు ఈ సంవత్సరంలో ఏమీలేవు.
ఇవి కూడా చూడండి:
- Love Letter Telugu: ప్రియుడి ప్రేయసికి, ప్రేమసి ప్రియుడికి రాసిన ప్రేమ లేఖలు
- Annaprasana Telugu: అన్న ప్రాసన ఎప్పుడు చేయాలి? ఏ వయసులో చేయాలి?
- Environment Essay In Telugu: పర్యావరణం పరిరక్షణ వ్యాసం తెలుగులో..
- Telugu Nakshatralu: తెలుగు నక్షత్రాలు