Husband And Wife Jokes In Telugu: భార్య భర్తల జోక్స్ తెలుగులో

Husband And Wife Jokes In Telugu: ఇప్పుడున్న అన్ని రకాల జోక్స్ లో భార్య భర్తల జోక్స్ చాలా పాపులర్. ఈ జోక్స్ అన్ని అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించినవే, చూసినవే.. భార్య భర్తలు అప్పుడప్పుడు ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ ఉంటారు. అలాంటి కొన్ని జోక్స్ ను సేకరించి మీకు కింద అందిస్తున్నాము.

Husband And Wife Jokes In Telugu

నిత్య జీవితంలో చాలా మంది పని ఒత్తిడితో అలసిపోతుంటారు.. బోర్ ఫీలవుతుంటారు. వారికోసం మీరు ఈ కింది జోక్స్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి నవ్వించే ప్రయత్నం చేయండి. కొన్ని సందర్భల్లో సంతోషంగా నవ్వడం కన్నా మించిన సంపద, ఆరోగ్యం లేదు.

భార్య భర్తల జోక్స్ తెలుగులో

భార్య: మన పొరిగింట్లోకి కొత్తగా వచ్చిన భార్య భర్తలు చాలా అన్యూన్యంగా ఉంటారు. ఎంతలా అంటే ఆ భర్త తన భార్యకు ప్రతి రోజు ముద్దు ఇచ్చి వెళతారు. మీరెందుకు అలా చేయరు..?
భర్త : నేను అతని భార్యను ముద్దు పెడితే ఏం బాగుంటుంది చెప్పు. ముందే ఆమె ఎవరో నాకు తెలియరు.
అంతే ఈ ఒక్క సమాధానంతో భార్య గొంతు మూగబోయింది.

మీ భార్య ఎప్పుడైనా తన తప్పులను లేదా పొరపాట్లను కరెక్ట్ చేయాలని చెబితే ఓ నవ్వు నవ్వేసి ఒప్పుకోండి. అంతే తప్పా చెప్పింది కదా అని ఆమె తప్పులను సరిజేసే ప్రయత్నం చేశారో మీరు ఆమె చేతికి చిక్కినట్లే..!

భార్య భర్తల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది
భర్త: నేను భర్త అనే పోస్టుకు రాజీనామా చేస్తున్నాను
భార్య: సరే.. నాకు మరొకరు భర్తగా వచ్చే వరకు మీరు భర్తగా ఉండి తీరాలి.

భార్య : నాతో 10 సంవత్సరాల ప్రయాణం అంటే ఏంటి..?
భర్త : ఒక్క క్షణం
భార్య : మరి నాకు 1000 డాలర్లు ఇస్తున్నారంటే..?
భర్త : అది ఒక నాణెంతో సమానం
భార్య : అయితే ఆ నాణెం నాకు ఇచ్చేయండి
భర్త : అలాగే ఇస్తాను కానీ ఒక్క క్షణం ఆగు..

కొత్తగా ఓ జంటకు పెళ్లయ్యింది. భర్త తొలినాళ్లలో ఆయన మొబైల్‌లో భార్య నెంబరు “MY LIFE ” అని సేవ్ చేసుకున్నాడు ఒక ఏడాది గడిచాక భార్య మొబైల్ నెంబరును “MY Wife” అని సేవ్ చేసుకున్నాడు రెండేళ్ల తర్వాత “Home” అని సేవ్ చేసుకున్నాడు ఐదేళ్ల అనంతరం “Hitler”అని నెంబర్ సేవ్ చేసుకున్నాడు 10ఏళ్ల తర్వాత “wrong number”అని సేవ్ చేసుకున్నాడు.

భార్య భర్తల మధ్య ప్రేమ ఎంత ముదిరిందంటే…
భార్య : భోజనం అయ్యిందా…
భర్త : నీ భోజనం అయ్యిందా..
భార్య : ముందు నేను అడిగాను..
భర్త : లేదు నేను అడుగుతున్నాను కదా చెప్పు
భార్య : నేనేమి అడిగితే అదే అడుగుతున్నావా..?
భర్త: లేదు నేనేమి అడగాలనుకుంటున్నానో నువ్వే అది అడుగుతున్నావ్..
భార్య : సరేలే.. షాపింగ్‌కు వెళదాం పదా..
భర్త: నా భోజనం అయ్యింది.

భార్య భర్త తో.. మెసన ఇద్దరిలో ఎవరు అందం గా ఉంటారు?
భర్త.. ఖచ్చితంగా నువ్వే
భార్య.. మనలో హా ట్ ఎవ్వరు?
భర్త.. ఇంకెవరు. నువ్వే.
భార్య. మనలో ఎవ్వరు బాగా మాట్లాడుతారు?
భర్త. అదికూడా నువ్వే
భార్య… మనలో ఎవరు తెలివైన వారు?
భర్త.. అనుమానం ఎందుకు
అదికూడా నువ్వే.
భార్య… మన ఇద్దరిలో ఎవర్ని అందరూ ఇష్టపడతారు?
భర్త.. నిన్నే డార్లింగ్
భార్య. మరి మనలో అబడ్డాలకోరు ఎవరు?
భర్త.. ఇంకెవరు నేనేగా..

ఏమిటో.. ఈ భర్తలు ఒక్క తన భార్య పెట్టే వాట్సాప్ స్టేటస్ తప్ప అందరివి చూస్తారు.. ఎందుకని..

భార్య లేకపోతే భర్త ఏమి సాధించలేడే అంటారు కదా…!!
అసలు భార్యలు లేకపోతే ఏదీ సాధించవలసిన అవసరమే రాదంటాను నేను…!!

భర్త: గతంలో భర్తలు లావుగా.. భార్యలు సన్నగా ఉండేవారు కానీ ఇప్పుడు భార్యలు లావుగా.. భర్తలు సన్నగా ఎందుకు ఉంటున్నారు స్వామీ ?
స్వామి: గతంలో భర్తలు తినగా మిగిలినది భార్యలు తినేవారు.. కానీ ఇప్పుడు భార్యలు తినగా మిగిలింది భర్తలు తింటున్నారు

అదేం విచిత్రమో ప్రతి భార్య తన పిల్లాడికి కృష్నుడి వేషం వేసి మురిసిపోతుందికాని మొగుడు కృష్ణుడిలా ఉంటానంటే మాత్రం సహించరు.. ఏంటో ఈ ఆడవారు

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు