Jokes In Telugu: తెలుగు జోక్స్

Jokes In Telugu: జోక్ మన జీవితంలో పార్ట్ మాత్రమే కాదు.. అది మనల్ని దు:ఖం నుంచి డిప్రెషన్ నుంచి ఎప్పటికప్పుడు రీచార్జ్ చేస్తుంది. మంచి హ్యూమర్, జోక్ లేనిదే ఏ చర్చ అంత బాగా ముగింపుకు రాదు. జోక్స్ చాలా రకాలుంటాయి. క్లాస్ రూం జోక్స్, భార్య భర్తల మధ్య జోక్స్, ఫ్రెండ్స్ మధ్య జోక్స్ ఇలా అనేక వేరియేషన్ జోక్స్ ఉంటాయి.

Jokes In Telugu

ఇక్కడి మేము మీకు భార్యా భర్తల మధ్య ఉన్న జోక్స్ కొన్నింటిని షేర్ చేస్తున్నాము. వీటిని మీకు నచ్చినప్పుడు స్టేటస్ గ పెట్టుకోండి లేదా మీ ఇష్టమైన వారిని ఎప్పుడైనా నవ్వించాలనుకుంటే ఈ జోక్స్ ను షేర్ చేయండి.

Jokes In Telugu ( తెలుగు జోక్స్)

భార్య: మన పొరిగింట్లో కొత్తగా దిగిన ఆయన ప్రతిరోజు ఆఫీసుకు వెళ్లే సమయంలో తన భార్యకు
ముద్దు ఇచ్చి వెళ్తాడు, అలా నువ్వెందుకు ముద్దు ఇవ్వవు
భర్త: నేనెలా ఆమెకు ముద్దు ఇవ్వగలను, ఆమె ఎవరో కూడా తెలియదే..!

భర్త: నాకు విడాకులు కావాలి. గత ఆరునెలలుగా నా భార్య నాతో మాట్లాడటం లేదు
లాయర్: ఒక్కసారి ఆలోచించు.. అలాంటి భార్యలు చాలా అరుదుగా దొరుకుతారు

భార్య: డాక్టర్ నా భర్త ఆస్ప్రిన్ మెడిసిన్ పొరపాటున మింగేశాడు.. ఇప్పుడేం చేయాలి..?
డాక్టర్ : అతనికి తలనొప్పి కలిగించే పని ఏదైనా చేయి.. అనవసరంగా టాబ్లెట్‌ను వేస్ట్
చేయడమెందుకు

భార్య: నేను నీతో మాట్లాడదలుచుకోలేదు భర్త: ఓకే
భార్య : కారణం ఏమిటో అడగవా..?
భర్త: అవసరం లేదు..నేను నీ మాటను గౌరవిస్తాను

భార్యా భర్తలు ఇద్దరూ ఓ రెస్టారెంటులో కలిసి భోజనం చేసేందుకు వెళ్లారు. ఇద్దరూ కూర్చొని ఉండగా
సర్వర్ వచ్చి ఆర్డర్ తీసుకుని భోజనం టేబుల్‌పై ఉంచాడు.
భర్త: భోజనం చాలా బాగుంది. తినడం ప్రారంభిద్దాం
భార్య: ఏమండి తినే ముందు ప్రార్థన చేసే అలవాటు ఉంది కదా… ప్రార్థన చేయండి
భర్త: అది ఇంటి భోజనంకే డియర్ , ఇక్కడ వంటవాడికి ఎలా రుచికరంగా వండాలో బాగా తెలుసు

భార్య భర్తతో : భోజనం చేశావా..?
భర్త భార్యతో: భోజనం చేశావా..?
భార్య భర్తతో : ముందు నేనడిగాను కదా..?
భర్త భార్యతో : నేను కూడా అడుగుతున్నాను కదా..?
భార్య : ఏంటి ఏది మాట్లాడితే అది తిరిగి చెబుతున్నావ్..?
భర్త: ఏంటి ఏది మాట్లాడితే అది మాట్లాడుతున్నావ్..?
భార్య : సరే షాపింగ్‌కు వెళ్దాం పదండి భర్త: నేను భోజనం చేసేశాను

కోర్టులో విడాకులు పొందేందుకు భార్యా భర్తలు తమ ముగ్గురు పిల్లలను తీసుకుని వెళ్లారు
జడ్జి: మీకు ముగ్గురు పిల్లలున్నారు కదా ఎలా వారిని పంచుకుంటారు..?
భార్యా భర్తలు చర్చించుకున్నాక: సరే సర్.. ఇంకొకరిని కని వచ్చే ఏడాది విడాకుల కోసం వస్తాం
9 నెలల తర్వాత కవలలు పుట్టడంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది.

గుండెనొప్పితో బాధపడుతున్న భర్త వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయమని భార్యను అడిగాడు. దీనికి
భార్య వెంటనే భర్త మొబైల్ ఫోన్ తీసుకుని పాస్‌వర్డ్ ఏంటో చెప్పు అని అడిగింది. దీనికి భర్త…
ఫర్వాలేదు.. అంబులెన్స్ అక్కర్లేదు.. నాకు ఆరోగ్యం బాగానే ఉందంటూ తెలివిగా సమాధానం
ఇచ్చాడు.

భార్య : దొంగ ఇంట్లోకి చొరబడి నేను చేసిన కేకును తింటున్నాడు చూడండి
భర్త: ఇప్పుడు నేనేం చేయాలి..? పోలీసులకు ఫోన్ చేయాలా.. లేక అంబులెన్స్‌కు ఫోన్ చేయాలా..?

భార్య: ఏం చేస్తున్నారండీ
భర్త: దోమల్ని చంపుతున్నానే..
భార్య : ఇప్పటి వరకు ఎన్ని చంపారండీ.. భర్త : మొత్తం ఐదు దోమలు చంపానే.. అందులో రెండు
ఆడవి.. మూడు మగ దోమలు భార్య : అవి ఆడవి, మగదోమలు అని మీకెలా తెలుసండీ..
భర్త : ఆ… ఏంలేదు. 2 అద్దం దగ్గర మరో మూడు బీర్ బాటిల్స్ దగ్గర ఉన్నాయి..

ఓ లోదుస్తుల దుకాణంలోకి ఓ ప్రముఖ హీరోయిన్ వెళ్లింది. అక్కడ తనకు కావాల్సిన లోదుస్తులను
సెలెక్ట్ చేసుకుంది. ఇక షాపు అతనితో ఇలా అంటోంది
హీరోయిన్: బాబూ ట్రయల్ రూం ఎక్కడ..?
షాపు అతను: ఎందుకు మేడం..?
హీరోయిన్ : ఒకసారి ఈ లోదుస్తులను ట్రయల్ వేయాలి
షాపు అతను : ఎందుకు మేడం.. ఇక్కడే ట్రయల్ వేసి చూస్కోండి. అభిమానుల ముందు
దాచేదేముంది. నేను మీ ఫ్యాన్‌ని..

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు