సింగర్ బప్పి లహిరి కన్నుమూత

ఈరోజు ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. బప్పి లహిరిగాా ప్రసిద్ధి చెందిన అలోకేష్ లాహిరి వయసు కేవలం 69 ఏళ్లు. అతను భారతీయ చలనచిత్రంలో సింథసైజ్డ్ డిస్కో సంగీతాన్ని ఉపయోగించడాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడు. బప్పి లహిరి 1970-80 చివరలో చల్తే చల్తే, డిస్కో డాన్సర్, షరాబి వంటి అనేక చిత్రాలలో సూపర్ పాటలను అందించారు. బప్పి లహరి పలు పాపులర్ తెలుగు చిత్రాలకు కూడా సంగీతాన్ని సమకూర్చారు.

bappi-lahiri-dies-at-69

2020లో శ్రద్దా కపూర్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన బాఘీ 3లో భంకాస్ పాట చివరిగా ఆలపించారు. తెలుగులో బప్పి లహిరి సింహాసనం సినిమాకు సంగీతం అందించాడు.. ఆ తర్వాత స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‏స్పెక్టర్ చిత్రాలకు సంగీతం అందించారు.

సంగీత దిగ్గజం లతా మంగేష్కర్ 92 సంవత్సరాల వయస్సులో మరణించిన పక్షం రోజులలోపే అతని మరణం సంభవించింది. బప్పి మరణం భారత సినీ పరిశ్రమకు తీరని లోటు

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు