
ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్’ సినిమా థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సందడి చేయలేకపోయింది.
థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్’ అక్టోబర్ 30, 2026 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
ఈ చిత్రంలో ఆది సాయికుమార్, మేఘలేఖ, లావణ్య, పవన్ తేజ్ కొణిదెల, గాయత్రి భార్గవి, జయలలిత, రాకేందుమౌళి వెన్నెలకంటి, శివకృష్ణ, కాదంబరి కిరణ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
రాఘవేంద్ర కటారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఎం. మార్కస్ సంగీతం అందించారు. రవీంద్రనాథ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా, ప్రదీప్ జూలూరు ఈ చిత్రాన్ని నిర్మించారు.
