
దుల్కర్ సల్మాన్ ఇటీవల నటించిన ‘ఐ యామ్ గేమ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సందడి చేయలేకపోయింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
నవంబర్ 06, 2026 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా ‘ఐ యామ్ గేమ్’ స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
దుల్కర్ సల్మాన్‌తో పాటు కయాదు లోహర్, ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, వినయ్ ఫోర్ట్, కథిర్, సంయుక్త విశ్వనాథన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
నహాస్ హిదాయత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. జిమ్షీ ఖలీద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
