
మలయాళ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అవరాచన్ & సన్స్’ ఇటీవల థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచింది.
థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ‘అవరాచన్ & సన్స్’ సినిమా అక్టోబర్ 30, 2026 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఈ సినిమాలో శ్రీనాథ్ భాసి, బిజు మీనన్, గ్రేస్ ఆంటోనీ, వినయ్ ఫోర్ట్, గణపతి, అఖిల భార్గవన్, జానీ ఆంటోనీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
తంబి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, జోసెఫ్ విజీష్, తంబి కథను అందించారు. సజిత్ పురుషన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా, సనల్ దేవ్ సంగీతం సమకూర్చారు. లిస్టిన్ స్టీఫెన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
