Fahadh Faasil OTT Movie: నెట్‌ఫ్లిక్స్‌లోకి ఫహాద్ ఫాజిల్ తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Fahadh Faasil OTT Movie నెట్‌ఫ్లిక్స్‌లోకి ఫహాద్ ఫాజిల్ తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

నటనలో G.O.A.T.గా పేరుగాంచిన ఫహాద్ ఫాజిల్ తొలిసారిగా నేరుగా తెలుగు సినిమాలో నటించారు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించడం విశేషం.

అయితే, విడుదలకు ముందు ఈ సినిమాపై ఏర్పడిన అంచనాలను అందుకోవడంలో చిత్రం విఫలమైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా అక్టోబర్ 30, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్‌తో పాటు వెంకటేష్ కాకుమాను, సారా పలేకర్, శశాంక్, మహేష్ మంజ్రేకర్, సౌరభ్ సచ్‌దేవ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

శశాంక్ యెలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, కాల భైరవ సంగీతం అందించారు. బ్రాడ్ ఫ్రాన్సిస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు