
జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆశా’ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద సగటు విజయంతో సరిపెట్టుకుంది.
ఇప్పుడు ఈ థ్రిల్లర్ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘ఆశా’ సినిమా అక్టోబర్ 16, 2026 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ సినిమాలో జోజు జార్జ్, ఊర్వశి, ఐశ్వర్య లక్ష్మి, జాయ్ మాథ్యూ, షరీ, అమృత కృష్ణకుమార్, విజయరాఘవన్, ప్రశాంత్ అలెగ్జాండర్, ఫెహ్మిన్, భాగ్యలక్ష్మి, రమేష్ గిరిజ, అజయన్ ఆదత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి సఫర్ సనల్ దర్శకత్వం వహించగా, నీలకంఠన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. అజయన్ ఆదత్ సంగీతం అందించగా, వినాయక అజిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
