Love Letter Telugu: ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ఎవరినో ఒకర్ని ప్రేమించే ఉంటారు. వారికి ప్రేమ లేఖ రాసే ఉంటారు. ఆ అనుభూతి జీవితంలో మర్చిపోలేనిది. అందరి ప్రేమలు సక్సెస్ కావు, ఫెయిల్ అయిన లవ్ స్టోరీలే ఎక్కువ. ప్రపంచంలో అన్నిటికంటే అందమైనది ప్రేమ. యవ్వనంలో కొందరు తమ ప్రేమసికి లేదా ప్రియుడికి ప్రేమలేఖలు ఎలా రాయాలో తెలియదు. అలాంటి వారికోసం మేము కింద రెండు ప్రేమ లేఖలు ఇస్తున్నాము. పేరు ఇడిట్ చేసి, ప్రియుడికో, ప్రేయసికో షేర్ చేసేయండి.
ప్రేయసి ప్రియుడికి రాసిన ప్రేమ లేఖ
ఎప్పుడూ నీ గురించే రా నా ఆలోచనలు, ఎప్పుడూ నీతోనే ఉండాలనిపిస్తుంది. నీతో ఉండే కొద్ది సేపు కోసం ఎంత సేపు వేచి చూసేదాన్ని.. నీతో ఉన్నంత సేపు ఎంత సంతోషంగా ఉంటానో నాకు కూడా తెలయదు రా.. నేను నా లైఫ్ లో ఇంత సంతోషంగా నేను ఎప్పుడూ లేనేమో అని అనిపి్తుంది… లైఫ్ మొత్తం నేను సంతోషంగా ఉంటాటంలే లైఫ్ అంతా నీతోనే ఉంటే సంతోషంగా ఉంటాను రా..!
ఎప్పుడూ నీతో మాట్లాడాలనిపిస్తుంది.. నీతో గొడవపడాలనిపిస్తుంది.. నీతో ఎన్నో విషయాలు చెప్పాలనిపిస్తుంది.. నీకు నేను ఫోన్ చేసేదాన్ని కానీ నువ్వు లిఫ్ట్ చెయ్యకపోయేవాడివి..! చాలా కోపం వచ్చేది.నీతో మాట్లాడే ఒక్క క్షణం కోసం పిచ్చిదానిలా నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తావా అని వేచి చూసేదాన్ని. ఎప్పుడూ పిచ్చి దానిలా నీగురించి ఆలోచించేదాన్ని, ఈ టైంకి ఏం చేస్తున్నాడా అని..!
నువ్వు ఎక్కడున్నా హాయగా ఉండాలన్నదే నా కోరిక కానీ ఆ సంతోషం నీతో పంచుకోవాలన్నదే ఓ చిన్న ఆశ.. లవ్ యూ సోమచ్ బంగారం..!!
ప్రియుడు ప్రేయసికి రాసిన ప్రేమ లేఖ
ఎలా రాయాలో తెలియదు? ఏమి రాయాలో తెలియదు? కానీ ఏదో రాయాలనిపిస్తుంది. నాలో ఉన్న భావాలన్నింటినీ అక్షరాలుగా మార్చాలనిపిస్తుంది. కానీ కలం ఒక్క అక్షరమైనా లిఖించలేకపోతుంది. రాని దాన్ని రాయడం ఎందుకని నువ్వు అడగవచ్చు, కానీ చెప్పడం నాకసలు చేతకాదు. చెప్పడానికి ఎంత ప్రయత్నిస్తున్నా మనసులోని మాట గొంతు దాటి రావటం లేదు..!! భావాన్ని తెలుపుదామని కలం పట్టుకొంటే..!! చేయి కూడా సహకరించడం లేదు…!!
చూపుల్ని చదవగలిగే భాషే కనుక నీకు వచ్చింటే..! నాకీ బాధ తప్పేది..! నా కళ్లల్లోని భావాలను సరిగా గమనించి ఉంటే…! వాటిలో రూపాన్ని, నీ మీద పెంచుకున్న ప్రేమను, అనురాగాన్ని నీవు గ్రహించేదానికి..! అందుకే నా ఫీలింగ్స్ అన్నింటికీ కలిపి ఒకే మాటలో చెప్పేస్తున్నాను..!!
ఐ లవ్ యూ..అని ఇంతకు మించి చెప్పడం నాకు రాదు బంగారం..!
ఇవి కూడా చూడండి: