Sankatahara Chaturthi Book In Telugu: సంకటహర చతుర్థి తెలుగు పుస్తకం, పూజ విధానం

Sankatahara Chaturthi Book In Telugu: విజ్ఞేశ్వరుడు, గథపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది చవితి తిధి. చవితి లేదా చతుర్ధి పూజను రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి చతుర్ధి, రెండు సంకటహర చతుర్ధి. అమవాస్య తరువాత వచ్చే చతుర్ధిరోజును వరదచతుర్ధి అంటారు, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్ధిని సంకటహర చతుర్ధి అంటారు.

Sankatahara Chaturthi Book In Telugu

 

సంకటహర చతుర్ధి మంగళవారం గనుక వస్తే దాన్ని అంగారక చతుర్ధి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషంగా చెబుతారు. ఈ అంతారక చతుర్ధిరోజు వ్రతం ఆచరిస్తే, కుజదోష సమస్యలతో పాటు, అన్ని సంకటములు తొలగిపోతాయి.

ప్రతీ మాసంలో కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో దాన్ని సంకటహర చతుర్ధిగా భావించాలి.

సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం

  • సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి
  • ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి
  • వ్రతం ప్రారంభించే రోజు ఉదయాన్నే సూర్యుడు రాకముందే స్నానం చేసి గణపతిని పూజించాలి
  • అరమీటరు పొడవున్న తెలుపు గుడ్డను, పంచ లాంటిదానిని వినాయకుడి ముందు ఉంచి, దానిని పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి
  • మనసులో కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసి, అనంతరం రెండు ఖర్జూరలు, రెండు వక్కలు కూడా వేసి ఆ తెల్లనిగుడ్డను మూటగా కట్టాలి.
  • ఆ తరువాత సంకటనాశన గణేశ స్త్రోత్రం చదవాలి.
  • ఆ మూటను స్వామి ముందు పెట్టి పూజచేసి నైవేద్యం పెట్టాలి.
  • తరువాత దగ్గరిలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి.
  • సూర్యాస్తమయం అయ్యేంత వరకు పూజచేసిన వినాయకుడిని కదిలించవద్దు.
  • సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి తిరిగి మళ్లీ వినాయకుడికి పూజ చేయాలి.
  • వ్రతం పూర్తయిన తరువాత ఆ మూటకట్టిన బియ్యాన్ని పొంగలిగా చేసి, స్వామికి నివేదించి ఆ తరువాత తినాలి.

సంకటహర గణపతి స్తోత్రం

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్
ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం
నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో
విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం
పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్
జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః

సంకటహర చతుర్ధి వ్రతాన్ని ఎప్పుడు ఎలా ఆచరించాలో పూర్తిగా వివరించేసాము. సంకటహర చతుర్థి పూజ పేరిట ప్రత్యేక పుస్తకాలు కూడా మీకు పూజీ సామాగ్ర షాపుల్లో అవలైబుల్ గా ఉంటాయి.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు