Varalakshmi Vratham In Telugu: వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. శ్రావణమాసం ముందు రోజు వచ్చే శుక్రవారంనాడు ఈ వరలక్ష్మి పూజను నిర్వహిస్తారు. వరలక్ష్మి దేవీని ప్రత్యేకంగా అలంకరించి ఆడపడుచులు ఈ పూజని నిర్వహిస్తారు. కోరిన వరాలను, సంపదను, సంతోషాన్ని వరలక్ష్మిదేవీ ప్రసాదిస్తుంది. స్త్రీలు నిత్యం సుమంగళిగా ఉండటానికి కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు.
వరలక్ష్మిపూజను చాలా నిష్టతో, పద్ధతితో చేయాలి. బ్రాహ్మణస్వామి చెప్పిన విధముగానే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి, లక్ష్మీ పూజ చేయాలి. అయితే ఈ పూజను ఎలా చేస్తారనే దాని గురించి మీకు వివరంగా కింద చెబుతున్నాము.
వరలక్ష్మి పూజా సామాగ్రి
పసుపు, కుంకుమ,
గంధం, విడిపూలు, పూల మాలలు,
తమలపాకులు, 30
వక్కలు, ఖర్జూరాలు,
అగరవత్తులు,
కర్పూరం,
చిల్లర పైసలు, తెల్లని వస్ర్తం, రవికల గుడ్డ,
మామిడి ఆకులు, ఐదు రకాల పండ్లు,
అమ్మవారి ఫోటో,
కలశం,
కొబ్బరి కాయలు,
తెల్ల దారం లేదా నోము దారం, లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో తయారుచేసిన నైవేధ్యాలు,
బియ్యం, పంచామృతాలు. దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి
పూజా విధానం
వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తరువాత తల స్నానం చేయాలి. దేవుడి మందిరాన్ని కూడా మళ్లీ మొత్తం శుభ్రం చేసి మండపాన్ని ఏర్పాటు చేయాలి. మండపంలో బియ్యపు పిండితో ముగ్గు వేసి, కళషం, అమ్మవారి ఫోటో, గణపతి ఫోటో, పూజా సామాగ్రిని సిధ్దం చేసుకోవాలి.
తోరం తయారు చేసుకోవడం
తెల్లటి దారాన్ని తొమ్మిది పోగులు తీసుకుని పసుపు రాయాలి. ఒక్కోదారానికి ఐదు పువ్వులు కట్టి ముడులు వేయాలి. అలా వేసిన దాన్ని పీఠం వద్ద ఉంచి, పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి.
గణపతి పూజ
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే .. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥ ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥ అని మంత్రం జపిస్తూ అక్షింతలు జల్లి గణపతికి నమస్కరించాలి. అనంతరం ఈ కింది మంత్రాన్ని చెప్తూ స్వామిపై పూలు జల్లాలి
ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణికాయ నమః,
ఓంలంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం గణాధిపాయ నమః,
ఓంధూమకేతవే నమః,
ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః,
ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయనమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
పైమంత్రం చెప్పిన అనంతరం స్వామివారిని మరోసారి మనస్పూర్తిగా స్మరించుకొని లక్ష్మిపూజను ప్రారంభించాలి. కింది మంత్రాన్ని జపిస్తూ వరలక్ష్మిదేవీని స్మరిస్తూ, నమస్కరిస్తూ.. పూలుజల్లాలి.
వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః,
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః,
ఓం సురభ్యై నమః
ఓంపరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓంస్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః,
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓంకామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓంబుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓంలోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓంలోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓంపద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓంపద్మముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓంపద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓంచంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓంఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతి పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓంభాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః,
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓంహేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓంవరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓంహిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓంమంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓంభువనేశ్వర్యై నమః
తోరపూజ
తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ విధంగా పూజ చేయాలి.
కమలాయైనమః ప్రథమగ్రంథిం పూజయామి,
రమాయైనమః ద్వితీయ గ్రంథిం పూజయామి,
లోకమాత్రేనమః తృతీయ గ్రంథింపూజయామి,
విశ్వజనన్యైనమః చతుర్థ గ్రంథిం పూజయామి,
మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి,
క్షీరాబ్ది తనయాయై నమః షష్ఠమ గ్రంథిం పూజయామి,
విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి,
చంద్రసోదర్యైనమః అష్టమగ్రంథిం పూజయామి,
శ్రీ వరలక్ష్మీయై నమః నవమగ్రంథిం పూజయామి.
ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే
పూజ అనంతరం లక్ష్మీదేవికి, గణపతి స్వామికి నమస్కరించి అక్షంతలు తలపై వేసుకొని పూజను ముగించాలి. చాలా నిష్టగా, భక్తితో ఈ లక్ష్మీ పూజను చేయాలి
ఇవి కూడా చూడండి:
- Balli Sastram In Telugu: బల్లి శాస్త్రం
- Telugu Nakshatralu: తెలుగు నక్షత్రాలు
- Triphala Churna Uses In Telugu: త్రిఫల చూర్ణం ఉపయోగాలు
- Chia Seeds In Telugu: చియా సీడ్స్ ప్రయోజనాలు