Grahalu In Telugu: నవ గ్రహాలు, మనుషులపై వాటి ప్రభావాలు

Grahalu In Telugu: పాఠశాలల్లో మనకి అంతరిక్షంలో గ్రహాలు తొమ్మిది అని చెబుతుంటారు. జ్యోతిష్యశాస్త్రంలో కూడా 9 గ్రహాలుంటాయి. ఈ 9 గ్రహాలను బట్టే మానవుడి జీవన స్థితి, భవిశ్యత్తుని అంచనా వేయవచ్చు. పండితులు, జ్ఞానులు ఈ తొమ్మిది గ్రహాల విషిష్టతను వాటి ప్రభావం గురించి ఎప్పుడో వివరించారు.

Grahalu In Telugu

మొత్తం 9 గ్రహాలు, అవే నవగ్రహాలు, స్యూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల విగ్రహాలను మనము గుళ్లో విళ్లినప్పుడు చూసి ఉంటాము. గుళ్లో ఓ పక్క నల్లని తొమ్మిది మూర్తులను ఒకే చోట పెట్టి పూజిస్తారు. వీరే నవగ్రహ దేవుళ్లు. నవగ్రహాలను ప్రదిక్షణ చేసిన తరువాత కాళ్లు కడుక్కుని మళ్లీ ఆ దేవాళయ దేవుణ్ణి దర్శణం చేసుకోమంటారు.

మనుశ్యుల స్థితిగతులు గ్రహాలను బట్టి మారుతూ ఉంటాయి. ప్రతీ గ్రహానికి ఒకరు అధిపతిగా ఉంటారు. సూర్యుడికి అధిపతిగా అగ్ని, చంద్రుడికి వరుణుడు, కుజుడికి కుమారస్వామి అధిపతి, బుధుడికి విష్ణువు అధిపతి, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి శచీదేవి, శనికి బ్రహ్మ అధిపతిగా ఉంటారు.

ఈ నవగ్రహాలు కూడా కొన్నింటికి అధిపతులుగా ఉంటాయి. సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి అధిపతి, కుజుడు చేదుకు, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపుకు, వగరు రుచులకు అధిపతులు, సూర్యుడు ఆయనముకు, చంద్రుడు క్షణముకు, కుజుడు ‌‌రుతువుకు, బుధుడు మాసముకు, గురువు పక్షముకు, శుక్రుడు సంవత్సరంలకు అధిపతులు.

గ్రహాలు, మనుష్యులపై వాటి ప్రభావాలు

సూర్యుడు: సకలరోగ నివారణ కర్త
చంద్రుడు: సంతానోత్పత్తి, జీవితంలో ఎదుగుదల, మనకు సంబంధించిన సంబంధాలు వంటి వాటిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అంగారకుడు/కుజుడు/మంగళ : ఒక వ్యక్తికి సంబంధించిన స్వేచ్ఛ, వ్యక్తిత్వం, ఆదర్శావాదాలకు సంబంధించిన అంశాలపై కుజుడి ప్రభావం ఉంటుంది
బుధుడు : ఈ గ్రహం ప్రభావం ఉన్న వారు పొట్టిగా ఉంటారు. వాక్చాతుర్యం కలిగి ఉంటారు. మేధాసంపత్తి కలవారై ఉంటారు.
బృహస్పతి: బలం, కీర్తి ప్రసాదిస్తాడు. ఈ గ్రహ ప్రభావం ఉంటే, విద్య, బుధ్ది, లభిస్తుంది.
శుక్రుడు: అనుకోని పరిస్థితుల వల్ల కుటుంబాలు విడిపోతాయి. బాగా కలిసి ఉండేవారి మధ్య శతృత్వం కనిపిస్తుంది.
శని : ఎక్కువ బాధలను ఇస్తాడు, కష్టాలు ఇస్తాడు. అయితే ఆ తరువాత మంచి చేసివెళ్తాడు
రాహువు: రాహువు ఏగ్రహంతో కలిసి ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు.
కేతువు: ఈ గ్రహ ప్రభావం వల్ల ఆస్తి నష్టం, చెడు అలవాట్లు, పుత్ర దోషం మొదలైవని కలుగుతాయి.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు