సీజన్ 6 అంతగా ఆకట్టుకోనప్పటికీ, సీజన్ 7 పైన చాల అంచనాలే ఏర్పడ్డాయి. ఇంతకీ ఈపాటికే నేను దేని గురించి మాట్లాడ్తున్నానో అర్థమైంది అనుకుంట. అవును ఎప్పుడుడెప్పుడా అని ఎద్దురు చూస్తున్న బిగ్ బాస్ 7, మొత్తనికి అంగరంగ వైభవంగా ఏ నెల అంటే సెప్టెంబర్ ౩వ తారీఖున స్టార్ మా లో ప్రసారమైంది మరియు హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అయింది.
ఇక మొదట రెండు రోజులు సరదాగా సాగినప్పటికీ, మూడవరోజు రోజు, గొడవలతో, ఊహకందని టాస్క్ లతో రసవత్తరంగా సాగుతుంది. అయితే మునుపటి సీజన్ల కి ఇపుడు ఈ సీజన్ కి ముఖ్యమైన తేడా ఏంటి అంటే వోటింగ్. ఇంతక ముందు కంటెస్టెంట్స్కి 10 ఓట్లు వేసే వీలు ఉండేది, కానీ ఇప్పుడు Bigg Boss 7 Voting ఆలా లేదు. ఇక ఆ వివరాలేంటో ఈ ఆర్టికల్ లో తెల్సుకుందాం.
బిగ్ బాస్ 7 తెలుగు వోటింగ్
బిగ్ బాస్ 7 తెలుగు వోటింగ్ అనేది మారినప్పటికీ, మీ ప్రియమైన కంటెస్టెంట్కి వోట్ వేయడం చాల సులభం. అయితే మీరు హాట్స్టార్ నుండి వోట్ వేయాలంటే, మొదటిగా హాట్స్టార్ అప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ తరువాత మీ ఫోన్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే, సెర్చ్ బార్ లో బిగ్ బాస్ 7 అని గాని, BB7 అని గాని టైపు చేయండి, ఆ తరువాత బిగ్ బాస్ 7 కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయగానే, ఎపిసోడ్స్ అన్ని ఓపెన్ అవుతాయి. అయితే కంగారు పడకుండా, ఎదో ఒక ఎపిసోడ్ మీద క్లిక్ చేయండి, చేసాక, ఎపిసోడ్ ఓపెన్ అవుతుంది, అయితే కుడి వైపున వోట్ అనే బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే, నామినెటే అయినా కంటెస్టెంట్స్ లిస్ట్ కనిపిస్తుంది, ఇక మీరు ఎవరినైతే సేవ్ చెయాలి అనుకుంటున్నారో వారి ఫోటో మీద టాప్ చేయండి. అంతే మీ వోటింగ్ అయిపోతుంది.
ఇక ఇంకో పద్ధతి చాల సులభం, అదే మిస్సెద్ కాల్, ప్రతి కంటెస్టెంట్స్ కి ఒక మొబైల్ నెంబర్ ని ఇస్తారు, మీరు ఎవరికైతే వోట్ వేయాలి అనుకుంటున్నారో, వాళ్ళ నెంబర్ ని డయల్ చేస్తే సరిపోతుంది.
బిగ్ బాస్ 7 తెలుగు స్టార్ట్ డేట్
ఈ సీజన్కి చాల అంచనాలు ఏర్పడడంతో, ఇంతక ముందు సీజన్ల కంటే ఇంకా ముందుగానే ఈ బిగ్ బాస్ 7 ప్రారంభం అయింది. ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 7 తెలుగు, సెప్టెంబ్ర్ ౩ వ తారీఖున, స్టార్ మా లో మరియు హాట్స్టార్ లో ప్రారంభం అయింది. ఇక ఈసారి మునుపెన్నడూ లేని విధంగా షో ఉంటుంది అని అనిపిస్తుంది.
బిగ్ బాస్ 7 తెలుగు OTT ప్లాట్ ఫామ్
ఇక ఈ బిగ్ బాస్ 7 ని మీరు చూడాలంటే Hotstar లో చూడొచ్చు, ఇంకా స్టార్ మా లో ఈ బిగ్ బాస్ 7 ని చూడొచ్చు. హాట్స్టార్ లో ప్రతి రోజు 9pm కి స్ట్రీమింగ్ అవుతుంది, ఇక స్టార్ మా లో 9:౩౦ కి ప్రసారం అవుతుంది.
బిగ్ బాస్ 7 తెలుగు హోస్ట్
సీజన్ ౬ తరువాత, నాగార్జున ఇక హోస్ట్ గా కొనసాగారు అని చాల ఊహాగానాలే వచ్చాయి, అయితే రానా దగ్గుబాటి గని, బాలకృష్ణ గాని హోస్ట్ గా వ్యవహరిస్తారని అన్నారు. అయితే అవన్నీ కొట్టి పారేస్తూ, ఈసారి కూడా నాగార్జున కూడా హోస్ట్ గా కొనసాగుతున్నారు.
బిగ్ బాస్ 7 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్
ఎవరు బిగ్ బాస్ 7 తెలుగు లో పార్టిసిపేట్ అవుతున్నారనే విషయంలో చాల పేర్లే వినిపించాయి, అయితే వాటిలో కొన్ని నిజం అయ్యాయి, కొన్ని అవ్వలేదు. ఇక మా దగ్గర కాన్ఫర్మేడ్ లిస్ట్ అయితే ఉంది. క్రింద మీకోసం కంటెస్టెంట్స్ లిస్ట్ ఉంచాము, చుడండి.
- ప్రియాంక జైన్
- శివాజీ
- దామిని
- ప్రిన్స్ యావర్
- శుభ శ్రీ
- రతికా రోజ్
గౌతం కృష్ణ - ఆటా సందీప్
- శోభా శెట్టి
- టేస్టీ తేజ
- షకీలా
- కిరణ్ రాథోడ్
- పల్లవి ప్రశాంత్
- అమర్దీప్
- పూజ మూర్తి
బిగ్ బాస్ 7 తెలుగు హోస్ట్ రెమ్యూనరేషన్
సీజన్ ౩ నుంచి న నాగార్జున విజయవంతంగా హోస్టింగ్ చేస్తున్నారు, అయితే రెమ్యూనరేషన్ అనేది ప్రతి సీజన్కి మారుతూ ఉంటుంది. ఇక గత సీజన్ కి నాగార్జున 12 కోట్లు తీసుకోగా, ఈ బిగ్ బాస్ 7 తెలుగు కి గాని, 24 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం.
బిగ్ బాస్ 7 తెలుగు ప్రైజ్ మనీ
సీజన్ 1 నుంచి గత సీజన్ 6 వరకు బిగ్ బాస్ ప్రైజ్ మనీ 50 లక్షలు. అయితే సీజన్ 4 నుంచి ప్రైజ్ మనీ తో పాటు, స్పాన్సర్లు ల్యాండ్ గాని, కార్ గాని, బైక్ గాని ఇస్తుంటారు. ఇక బిగ్ బాస్ 7 తెలుగు కి ప్రైజ్ మనీ 75 లక్షలకి చేరుకునే అవకాశం ఉందని అందుబాటులో ఉన్న సమాచారం.
మీరు బిగ్ బాస్ ప్రేమికులైతే మరియు బిగ్ బాస్ 7 తెలుగు గురించిన ప్రతి సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే, మా వెబ్‌సైట్‌ను విసిట్ చేయడం మాత్రం మరిచిపోకండి.