Sankranti Colours Identification:ఈ సంవత్సరం, అంటే 2025 సంక్రాంతి పండగ ఇంకో వారం రోజుల్లో అంగరంగ వైభవంగా జరగబోతూఉంది. ఎప్పట్లాగే సంక్రాంతి అంటే మనకి మొదటగా గుర్తుకు వచ్చేది, కోడి పందాలు.
మునుపటి కంటే, ఈసారి భారీ ఎత్తున కోడి పందాలు జరగబోతున్నాయి అని అంచనా. అయితే కోడి పందాల్లో, కోడి రంగు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. రంగుని నమ్ముకొని పందెం కాసినవాళ్లు ఎప్పటికి లాస్ ఎవ్వరూ అని పెద్ద వాళ్లు చెపుతూ ఉంటారు. ఒకవిధంగా అది నిజం కూడా.
ఎప్పుడైనా సరే, ఎదుటి కోడిని బట్టి, కోడి రంగు మారుతుంది. ఇది మనం మొదటగా గుర్తుంచుకోవాలాల్సిన విషయం.
కోడి కాకి డేగ, ఇటుక డేగ, రసంగి డేగ, గరుడ మైల, పసిమి డేగ, కోడి డేగ, ఎర్ర మైల ఇలా కొన్ని రంగుల కోళ్లు ఖచ్చితంగా గెలిస్తుంటాయి.
ఒక్కోసారి సమరంగుల పందాలు జరుగుతుంటాయి, దీన్నే అన్నదమ్ముల పందెం అంటారు.
అలాంటి సమయంలో రేట్లు ఉన్నదానికంటే ఎక్కువగా పలుకుతుంటాయి. అలంటి సమయంలో ఫలానా కోడి రంగుకి ఎంత డిమాండ్ ఉన్న సరే, పందెం వేయకూడదు.
ఒకవేళ అలాంటి సమయంలో వేయాలి అనుకుంటే, బలంగా ఏ కోడి ఉందని చూసి దాని పైన పందెం వేయాలి.