Secrets Of Gayathri Mantra: గాయత్రి మంత్రం చాలా శక్తివంతమైందని ఇప్పటికే మీరు విని ఉంటారు. పిల్లలకు మొదట్లో ఇదే గాయత్రీ మంత్రాన్ని చెప్పిపిస్తారు. గాయత్రీ మంత్రం చుట్టూ ఎన్నో రహస్యాలు, అద్భుతాలు పెనవేసుకొని ఉన్నాయి. అసలు గాయత్రీ మంత్రము అంటే ఏంటి? ఎలా చదవాలి? లాంటి విశేషాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
గాయత్రీ మంత్రం విశేశాలు, ఎలా చదవాలి, గాయత్రీ మంత్రం అంటే ఏమిటి..?
“ఓం భూర్భువస్సువ:
తత్ సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి,
ధియోయోన: ప్రచోదయాత్”
పై మంత్రాన్ని బట్టీ పట్టినట్లు ఏకబిగిన ఒకే సారి చదవకూడదు. గాయత్రీ మంత్రలో “వ్యాహృతులు” అనేవి దివ్యశక్తిని కలిగి ఉంటాయి. ఇవి 3 లోకాలను సూచిస్తాయి. గాయత్రి మంత్రంలో 24 భీజాక్షరాలు ఉంటాయి. ఈ 24 భీజాక్షరాలను ఆధారం చేసుకొని ఆలయాలను నిర్మించారు. వాటిని ఓసారి చూద్దాం.
1. తమిళనాడులో కంచి కామాక్షి మందిరంలో అమ్మవారు కూర్చున్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాకారంలో 24 స్తంభాలున్నాయి.
2.కోణార్క్ లోని సూర్య దేవాలయంలో ఓ పెద్ద రధం ఉంది. ఆరధానికి గాయత్రీ మంత్రం ప్రతీకగా 24 చక్రాలు ఉన్నాయి.
3.పురాణాల ప్రకారం 24మంది రుషులు వారి మంత్రశక్తిని ఈ 24 భీజాక్షరాల్లో నిక్షిప్తం చేశారు.
4. జైన సిద్ధాంలో కూడా 24 తీర్ధంకరాలు ఉంటారు.
5. 24 కేశవ నామాలు
6. మొత్తం 24 తత్వాలు ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, 5 మహాద్భుతాలు, బుద్ధి, ప్రకృతి, అహంకారం, మనస్సు
7. ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద ఉన్నది
8. రామాయణంలో 24 సహస్ర శ్లోకాలు ఉన్నాయి
9. రామాయణం గాయత్రీ మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది.. 1, 10001, 2001, 3001, 1001,…23001 శ్లోకాల్లో గాయత్రి మంత్రమే కనబడుతుంది.
10 ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి
11. మన వెన్నుబాములో 24 మ్రుదులాస్తులు ఉంటాయి.
గాయత్రీ మంత్రాన్ని జపిస్తే సర్వ పాపాలు హరిస్తాయి. సకల దేవతా స్వరూపం గాయత్రీ మంత్రం. రామాయణ సారం గాయత్రీ మంత్రం. కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. విశ్వ శాంతికి పరిష్కారం గాయత్రీ. 24 బీజాక్షర సంపుటి గాయత్రి. గాయత్రీ మాతను స్మరణం చేసుకోవడం పూర్వ జన్మ సుకృతం.
గాయత్రీ మంత్రాన్ని పిల్లల చేత రోజూ జపింపజేపిస్తే దేవుడి ఆశిస్సులతో పాటు భారత సంస్కృతి గొప్పతనం కూడా మరింత పెరుగుతుంది. గాయత్రీ మంత్రం ఉచ్ఛరించేటప్పుడు కొన్ని శక్తులు వెలువడుతున్నట్లు కొందరు శాస్త్రవేత్తలు సైతం కనుగ్గొన్నారు.
ఇవి కూడా చూడండి
- Venkateswara Swamy Stotram In Telugu: వెంకటేశ్వర స్వామి స్తోత్రం తెలుగులో
- Shiva Tandava Stotram In Telugu: శివతాండవ స్తోత్రం లిరిక్స్ తెలుగులో
- Siddha Mangala Stotram: సిద్ధ మంగళ స్తోత్రం
- Dwadasha Jyothirlinga Stotram: ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం