Ashtalakshmi Stotram: అష్టలక్ష్మి స్తోత్రం, అష్టైశ్వర్యాల దేవతలు

Ashtalakshmi Stotram: అష్ట అంటే ఎనిమిది. అష్టలక్ష్మీ అంటే ఎనిమిది లక్ష్మీ దేవతలు. ఈ ఎనిమిది లక్ష్మీ దేవీలను పూజిస్తే.. జీవితంలో అష్టకష్టాలు పడకుండా ఐష్వర్యం లభిస్తుంది. లక్ష్మీ మాత శుభాన్ని, సంపదని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ఎనిమిది లక్ష్మిదేవీ ఎవరు? వారి గురించి, ఈ అష్టలక్ష్మీ స్తోత్రం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

అష్టలక్ష్మీ స్తోత్రం

అష్టలక్ష్మీలు: ఆదిలక్ష్మీ, ధాన్య లక్ష్మీ, ధైర్య లక్ష్మీ, గజలక్ష్మీ, సంతాన లక్ష్మీ, విజయ లక్ష్మీ, ధనలక్ష్మీ, విధ్యాలక్ష్మీ

అష్టలక్ష్మీలను పూజించడం వలన షోడశ ఫలాలు మనకు లభిస్తాయని శాస్త్రం చెబుతుంది. ఆ షోడష ఫలితాలు, కీర్తి, జ్ఞానం, ధైర్యం, విజయం, సత్సంతానం, యుద్ధ నైపుణ్యం, బంగారం ఇతర సంపదలు, సంతోషం, భౌతిక సుఖాలు, తెలివితేటలు, అందం, విద్యాభివృద్ధి, ఉన్నత విలువలు..ధ్యానం, నీతి నియమాలు, మంచి ఆరోగ్యం, దీర్ఘ ఆయు:.

అష్టలక్ష్మీ స్తోత్రం:

ఆదిలక్ష్మి :- సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే | పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ || 1 ||

ధాన్యలక్ష్మి:- అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే | మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ || 2 ||

ధైర్యలక్ష్మి:- జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే | భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 3 ||

గజలక్ష్మి:- జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే | హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ || 4 ||

సంతానలక్ష్మి:- అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే | సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ || 5 ||

విజయలక్ష్మి:- జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞానవికాసిని గానమయే అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే | కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ || 6 ||

విద్యాలక్ష్మి:- ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే | నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ || 7 ||

ధనలక్ష్మి:- ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే | వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ || 8 ||

ఫలశృతి:- శ్లో|| అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి | విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని || శ్లో|| శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః | జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు