
నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ అత్యంత భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ , బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ‘ది ప్యారడైజ్’ అక్టోబర్ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
ఈ చిత్రంలో నానితో పాటు మోహన్ బాబు, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. సీహెచ్ సాయి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించగా, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
