Tulasi Pooja Vidhanam In Telugu: తులసి పూజా విధానం

Tulasi Pooja Vidhanam In Telugu: తులసి చెట్టు చాలా పవిత్రమైనది. తులసికి పురాణాల్లో చాలా ప్రాముఖ్యత ఉన్నది. తులసిని సాక్షత్తు శ్రీలక్ష్మీదేవి సమానంగా చూస్తారు. సత్యభామ తులాభారంలో సంపద ఇచ్చినా లొంగక రుక్మిని ఇచ్చిన తులసికి శ్రీకృష్ణుడు బధ్దుడై ఉన్నట్లు మనకు శాస్త్రాలు చెబుతున్నాయి.

Tulasi Pooja Vidhanam In Telugu

తులసి చెట్టుని ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఎంతో మేలు, శుభం జరుగుతుంది. తులసిలో ఎన్నో ఔషదగునాలుకూడా ఉన్నాయి. తులసి ఆకులను అమృత పత్రాలుగా ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. ఇంట్లో తులసి ఉంటే, రోజు పూజ చేసి, నమస్కరించడం మన కనీస ధర్మం.

అనన్యదర్శనాః ప్రాతః మే పశ్యంతి తపోధన
జగత్త్రితయ తీర్థాని తైర్దృష్టాని న సంశయః

ఉదయాన్నే లేచి తులసి చెట్టుని చూస్తే.. ముల్లోకములోని దేవతలను దర్శించిన భాగ్యం కలుగుతుందని బ్రహ్మపురాణం చెబుతుంది.

తులసి పూజ ఎలా చేయాలి?

ఉదయం లేవగానే ముందు దూరం నుంచి తులసిని చూసి నమస్కరించాలి. ఆ తరువాత స్నానం చేసి తులసి చెట్టు పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పసుపు, కుంకుమతో తులసి చెట్టు ఉంటే తొట్టిని అలంకరించాలి.

తులసి పూజ పర్తయిన తరువాత కొన్ని అప్పటికే కోసి ఉంచిన తులసి ఆకులను నోట్లో వేసుకోవాలి.

తులసి వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు శుభాలు కలుగుతాయి. ఇంట్లో తులసి చెట్టు ఉంటే అది తీర్ధంలా ఉంటుంది. తులసి వల్ల లాభాలే కానీ నష్టాలు లేవు. ఇప్పుడే ఇంట్లో కనీసం ఒక చిన్న తులసి మొక్కనైనా పెంచండి. ఆక్సిజన్ తీసుకొని మళ్లీ ఆక్సిజన్ నే విడుదల చేసే ఒకే ఒక చెట్టు, జీవి తులసి మాత్రమే.

తులసి చెట్టు వాస్తు

ఈశాన్య భాగంలో ఎలాంటి తులసి మొక్కలు పెంచకూడదు. తులసి, బిల్వం, జమ్మ, ఉసిరి, వేప, సరస్వతి మొక్క, బ్రహ్మకమలం, రుద్రక్ష, మరువం, దవనం, పున్నాగ, కదంబం లాంటి దైవ మెక్కలు ఈశాన్య భాగంలో పెడితే పెరగవు. వాస్తు ప్రకారం వాటిని పెంచినే బాగా పెరుగుతాయి. ఈ డైవ మొక్కలను ఇంటి ఆగ్నేదిశలో పెంచాలి.

ప్రతీ ఒక్కరు తమ ఇంటి ఆవరణలో తులసి చెట్లుు ఉండే విధంగా చూసుకోవాలి. తులసి చెడు శక్తులను నియంత్రించడంతో పాటు అనేక వైద్య ప్రయోజనాలను ఇస్తుంది. చికటి పడగానే, తులసి మొక్క చీకట్లో ఉండకుండా లైట్ లేదా చిన్న దీపం అమర్చాలి. తులసి మొక్కని పూజ గదిలో చన్ని కుండీలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు