Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వచ్చేసోంది..!!

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ సీజన్ 5 పూర్తయింది. సన్నీ విన్నర్ గా, శన్ముఖ్ రన్నరప్ గా గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మళ్లీ బిగ్ బాస్ సీజన్ 6 ఎప్పుడెప్పుప్పుడా అని ఎదురుచూసే బిగ్ బాస్ లవర్స్ కి ఒక శుభవార్త. ఈ సారి చిన్ని బిగ్ బాస్ స్టైల్ లో బిగ్ బాస్ కొత్త ప్రయోగం చేయనుంది.

bigg-boss-telugu-ott

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ( Bigg Boss Telugu OTT)

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ పేరుతో మొదటి సీజన్ ను వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరీ లో స్టార్ట్ చేయనున్నారు. రెగులర్ బిగ్ బాస్ లా ఈ బిగ్ బాస్ ఓటీటీ కూడా మంచి కిక్ ఇస్తుంది. అయితే ఈ బిగ్ బాస్ తెలుగు ఓటీటీ కేవలం 42 నుంచి 49 రోజుల వరకే ఉంటుంది, అంటే ఏడు వారాల్లో సీజన్ మొత్తం కంప్లీట్ అయిపోతుందన్నమాట..

ఫిబ్రవరీ 2022 లో స్టార్ట్

ఫిబ్రవరీ లో స్టార్ట కాబోయే చిన్ని బిగాబాస్, అదే.. బిగ్ బాస్ ఓటీటీ మెయిన్ గా హాట్ స్టార్ ఓటీటీలో 24గంటల పాటు స్ట్రీమ్ అవుతుంది. ఆడియన్స్ ప్రతీ రోజు, ఎపిసోడ్ కోసం వెయిట్ చేయకుండా డైరెక్ట్ గా హైస్ లో ఉన్న కెమరాల ద్వారా 24 గంటల వరకు ఏమి జరుగుతుందో చూడవచ్చు. హౌస్ లోపల ఉండే డైరెక్ట్ కెమరా యాక్సెస్ ను ప్రేక్షకులు ఈ Bigg Boss Telugu OTT ద్వారా పొందుతారు.

హిందీలో ప్రాయోగం

బిగ్ బాస్ ఓటీటీని మొదటి సారి హిందీ వర్షన్ లో ట్రై చేసారు. ఆగస్టు 8న హిందీ బిగ్ బాస్ స్టార్ట్ అయి సెప్టెంబర్ 18కి మొత్తం కంప్లీట్ అయింది. ప్రొడ్యూసర్ కరన్ జోహర్ దానికి హోస్ట్ గా వ్యవహరించారు. కేవలం 42 రోజులు సాగిన ఈ బిగ్ బాస్ ఓటీటీలో మొత్తం 13మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ ఈ షోకి ప్రత్యేక థీమ్ ని డిసైడ్ చేసింది అదే.. “Stay Conneted”. ఈ థీమ్ ను బట్టి హౌస్ మేట్స్ అపోసిట్ జెండర్ తో కనెక్ట్ అయి ఉండాలి, అలా లేని వాళ్లను బిగ్ బాస్ ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. ప్రతీ వారం 2 చొప్పున ఎలిమినేట్ అవుతారు. నామినేషన్స్, ఎలిమినేషన్ పవర్ ను ఆడియన్స్ నేరుగా పొందుతారు. దాన్ని బట్టే ఎలిమినేన్ జరుగుతూ ఉంటుంది.

హోస్ట్ గా మళ్లీ నాగార్జున

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ గురించి అక్కినేని నాగార్జున డిసెంబర్ 24న అధికారిక ప్రకటన చేశారు. ఫిబ్రవరీలో బిగ్ బాస్ ఓటీటీ స్టార్ట్ అవుతుందని, తానే దానికి మళ్లీ హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు చెప్పారు. ఆడియన్స్ కు బిగ్ బాస్ ను కొత్త స్టైల్ లో పరిచయం చేయనున్నట్లు చెన్పారు. 24 గంటలు హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుందన్నారు. ఎపిసోడ్ వైస్ గా చానల్ లో కూడా ప్రసారం చేస్తారని క్లారిటీ ఇచ్చారు.

సీక్రెట్ గా సెలెక్షన్స్

ఇక బిగ్ బాస్ తెలుగు ఓటీటీ కంటెస్టెంట్ ఎవరనేది ఇంకా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకైతే ఎవరి పేర్లు తెరపైకి రాలేదు. అయితే యూట్యూబ్ యాంకర్ శివ ఇప్పటికే ఫైనల్ అయ్యాడని రూమర్స్ వ్యాపించాయి. బిగ్ బాస్ సెలక్షన్స్ చాలా సీక్రెట్ గా జరుగుతాయి. కంటెస్టెంట్స్ కి తప్పిస్తే ఎవరికీ తెలిసే చాన్స్ ఉండదు. సుమారు 50 మందితో అగ్రిమెంట్ సయిన్ చేయించుకున్న తరువాత వాటిలో 15 మందికి మాత్రమే చాన్స్ దక్కుతుంది. ఈ bigg boss telugu ott vote రెమ్యునరేషన్, ప్రైజ్ మనీ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది.

టాప్ 5కి సీజన్ 6లో ఎంట్రీ

భిగ్ బాస్ ఓటీటీలో టాప్ 5లో గెలిచిన వారికి బిగ్ బాస్ సీజన్ 6లో డైరెక్ట్ ఎంట్రీ దక్కే చాన్స్ ఉంది. హిందీ బిగ్ బాస్ లో ఇలాగే చేసారు. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ కంఫర్మ్ డేట్, కంటెస్టెంట్స్, ప్రైజ్ మనీ డీటెయిల్స్ మరికొన్ని రోజుల్లో తేలనున్నాయి. అంతవరకు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మరిన్ని అపడేట్స్ కోసం మా వెబ్ సైట్ ను విజిట్ చేస్తూ ఉండండి.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు