AP State Bird: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక పక్షి

Ap State Bird: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2018 లో అధికారిక చిహ్నాలకు సంబంధించి కొంత మార్పులు చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందు, రెండు రాష్ట్రాలకు కలిపి రాష్ట్రపక్షిగా “పాలపిట్టి” ఉండేది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం, పాలపిట్టను అలాగే రాష్ట్ర పక్షిగా గుర్తించడం కంటిన్యూ చేసింది. ఏపీ ప్రభుత్వం కొంత భిన్నంగా “రామ చిలుకను” రాష్ట్రపక్షిగా ప్రకటించింది.

ap-state-bird

రాష్ట్ర పక్షిరామ చిలుక
రాష్ట్ర జంతువుజింక
రాష్ట్ర చెట్టువేప చెట్టు
రాష్ట్ర పువ్వుమల్లె పువ్వు

 

రామచిలుక పక్షికి హిందూ పురాణాల్లో ఎంతో వైశిష్టత ఉంది. రామచిలుకకి ట్రైనింగ్ ఇస్తే కొన్ని పదాలను కూడా వల్లిస్తాయి. చూడటానికి పచ్చగా, ఎర్రటి ముక్కుతో అందంగా ఉంటుంది. కొందరు చిలుక జోష్యం పేరుతో వీటిని జాతకం చెప్పడానికి ఉపయోగించుకుంటారు.

2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక చిహ్నాల్లో కీలక మార్పులను చేసింది. రాష్ట్ర జంతువుగా జింకను, రాష్ట్ర చెట్టుగా వేపచెట్టును, రాష్ట్ర పువ్వుగా మల్లె చెట్టుని అలాగే రాష్ట్ర పక్షిగా రామ చిలుకని ఖరారు చేసింది. ఈ నిర్ణయంతో ఇప్పటినుంచి ప్రకటించిన వీటిని సంరక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. చిలుకలను, మల్లె చెట్లను, వేపచెట్లను జింకలను ఎవరైనా హతమార్చాలని చూసినా, తొలగించాలని చూసినా వారిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు